రేపు టీడీపీ శాసనసభాపక్షం భేటీ
టీడీపీ శాసనసభాపక్షం రేపు(ఆదివారం) ఉదయం 10.30 గంటలకు సమావేశంకానుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం నుంచి ముఖ్యనేతలతో అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు.
ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎంతో కీలకమైన సీఆర్డీయే చట్ట సవరణ బిల్లు సహా ఇంగ్లీషు మీడియం, ఎస్సీ వర్గీకరణ బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం
రేపు టీడీపీ శాసనసభాపక్షం భేటీ